గూగుల్ మీట్‌లో లాంగ్వేజ్ మ్యాజిక్: ఇక ఏ భాషలోనైనా మాట్లాడొచ్చు.. గూగుల్ కొత్త ఫీచర్!

Google Meet interface showing real-time speech translation feature icon

  • రియల్ టైమ్ స్పీచ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను ప్రకటించిన గూగుల్
  • వాయిస్, టోన్ మరియు ఎక్స్‌ప్రెషన్ మారకుండా అనువాదం
  • చాలా తక్కువ లాటెన్సీ ఉండటంతో సహజమైన సంభాషణలు సాధ్యం
  • తొలుత ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో బీటా వెర్షన్ విడుదల

గూగుల్ డీప్‌మైండ్ (Google DeepMind) రూపొందించిన లార్జ్ లాంగ్వేజ్ ఆడియో మోడల్‌ సాయంతో ఈ ఫీచర్ పనిచేస్తుంది. అవతలి వ్యక్తి ఏ భాషలో మాట్లాడినా.. వినేవారికి వారు కోరుకున్న భాషలోకి తక్షణమే అనువాదం అవుతుంది. అనువాదం జరిగేటప్పుడు అవతలి వ్యక్తి అసలు వాయిస్ తక్కువ శబ్దంతో వినిపిస్తూనే, దానిపై అనువదించబడిన మాటలు స్పష్టంగా వినిపిస్తాయి(Google Meet Real Time Speech Translation Feature).

అవసరం ఏదైనా..

ఈ కొత్త టెక్నాలజీతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు, కంపెనీలు సులభంగా కనెక్ట్ అవ్వొచ్చు.

  • గ్లోబల్ టీమ్స్: వివిధ దేశాల్లో ఆఫీసులు ఉన్న కంపెనీల ఉద్యోగులు రియల్ టైమ్‌లో చర్చించుకోవచ్చు.
  • ఫ్యామిలీ కనెక్టివిటీ: వేర్వేరు భాషలు మాట్లాడే మనవలు, తాతమ్మలు కూడా ఇకపై మనసు విప్పి మాట్లాడుకోవచ్చు.
  • మల్టీ-పర్సన్ చాట్: తక్కువ లాటెన్సీ కారణంగా ఒకేసారి ముగ్గురు నలుగురు కలిసి మాట్లాడుకోవడం సులభతరం అవుతుంది.

రోల్ అవుట్ ఎప్పటి నుంచి?

ఈ ఫీచర్ మంగళవారం నుంచి కన్స్యూమర్ AI సబ్‌స్క్రైబర్లకు బీటా వెర్షన్‌లో అందుబాటులోకి రానుంది. తర్వాత కొద్ది వారాల్లోనే ఇటాలియన్, జర్మన్, పోర్చుగీస్ వంటి మరిన్ని భాషలు యాడ్ కానున్నాయి. వర్క్‌స్పేస్ (Workspace) బిజినెస్ కస్టమర్ల కోసం ఈ ఏడాది చివర్లో టెస్టింగ్ ప్రారంభం కానుందని గూగుల్ స్పష్టం చేసింది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *