ట్రూకాలర్‌లో సరికొత్త మ్యాజిక్: వాయిస్ మెసేజ్ వినాల్సినమే కాదు.. చదువుకోవచ్చు!

Truecaller app showing the new AI voicemail transcription feature on an Android smartphone

📌 ముఖ్యమైన పాయింట్లు

  • ఉచిత AI వాయిస్‌మెయిల్ ఫీచర్ ప్రవేశపెట్టిన ట్రూకాలర్.
  • వాయిస్ టు టెక్స్ట్ అనువాదం చేసే ఇన్‌స్టంట్ ట్రాన్స్‌క్రిప్షన్
  • తెలుగు సహా 12 భాషల్లో వాయిస్ మెసేజ్‌లు చదివే సదుపాయం
  • నేరుగా ఫోన్ లోనే వాయిస్ రికార్డింగ్‌ల భద్రత

ట్రూకాలర్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు తమకు వచ్చిన వాయిస్ మెసేజ్‌లను వినాల్సిన అవసరం లేకుండానే టెక్స్ట్ రూపంలో చదువుకోవచ్చు. ఎవరైనా వాయిస్ మెయిల్ పంపినప్పుడు, AI దానిని కేవలం కొన్ని సెకన్లలోనే వినియోగదారుడికి ఇష్టమైన భాషలోకి మారుస్తుంది. దీంతో మీటింగ్స్ లేదా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉన్నప్పుడు కూడా వాయిస్ మెసేజ్‌లలో ఏముందో సులభంగా తెలుసుకోవచ్చు(Truecaller AI Voicemail Feature Android India).

స్పామ్ రక్షణ.. మెరుగైన భద్రత:

ఈ ఫీచర్ కేవలం మెసేజ్ అనువాదానికే పరిమితం కాకుండా మరిన్ని ప్రయోజనాలను అందిస్తోంది:

  • స్పామ్ ఫిల్టరింగ్: అనుమానాస్పద నంబర్ల నుంచి వచ్చే వాయిస్‌మెయిల్స్‌ను AI ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది.
  • స్మార్ట్ కేటగరైజేషన్: వచ్చిన మెసేజ్‌లను వాటి ప్రాధాన్యతను బట్టి వర్గీకరిస్తుంది.
  • ప్రైవసీ: రికార్డింగ్‌లు క్లౌడ్ లో కాకుండా నేరుగా యూజర్ ఫోన్ లోనే సేవ్ అవుతాయి.
  • వేగం: మెసేజ్ వినేటప్పుడు ప్లేబ్యాక్ స్పీడ్ ను కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు.

12 భారతీయ భాషలకు మద్దతు:

ట్రూకాలర్ సీఈఓ రిషిత్ ఝున్‌ఝున్‌వాలా తెలిపిన వివరాల ప్రకారం, ఈ సదుపాయం తెలుగుతో పాటు హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం వంటి మొత్తం 12 భారతీయ భాషలకు మద్దతు ఇస్తుంది. ఈ సదుపాయం వాడాలంటే మొబైల్ నంబర్ కు ‘కాల్ ఫార్వార్డింగ్’ ఆన్ అయి ఉండాలి. ఆండ్రాయిడ్ వినియోగదారులందరికీ ఇది ఉచితంగా అందుబాటులో ఉంటుంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *