ఐఫోన్ 18 ప్రో వస్తోంది… ధర మాత్రం భారీగా పెరగబోతోంది!

iPhone 18 Pro concept render with new design

సెప్టెంబర్ 8 లేదా 9న లాంచ్… ₹17,000 వరకు ధర పెంపు!

ఐఫోన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? గ్యాడ్జెట్ ప్రియుల ఫేవరేట్ గా ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ప్రతిసారీ కొత్త ఫీచర్స్ తో వచ్చి అందర్నీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆ క్రేజ్ ని మరింత పెంచేలా యాపిల్ తన కొత్త ఐఫోన్ 18 ప్రో సిరీస్ తో ముందుకొచ్చింది. సెప్టెంబర్ 8 లేదా 9న లాంచ్ కాబోతోందని టెక్నాలజీ ఎక్స్‌పర్ట్స్, మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ సారి ధర మాత్రం భారీగా పెరగబోతోంది. మెమరీ చిప్ కొరత కారణంగా ఐఫోన్ 18 ప్రో ధర సుమారు ₹1 లక్ష నుంచి ₹1.10 లక్షల వరకు, ప్రో మ్యాక్స్ ధర ₹1.10 లక్షల నుంచి ₹1.19 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. మునుపటి మోడల్ కంటే ₹17,000 వరకు ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు. అలాగే కొత్త ఫీచర్స్ విషయానికి వస్తే… డైనమిక్ ఐలాండ్ 35% చిన్నదిగా ఉంటుంది. కొత్త A20 ప్రో చిప్ సెట్ TSMC 2nm ప్రాసెస్ పై ఆధారపడి పనిచేస్తుంది. దీంతో 15% వేగవంతమైన పనితీరు, 30% బెటర్ పవర్ ఎఫిషియన్సీ లభిస్తుంది. మరోవైపు కెమెరాలో మానువల్ వేరియబుల్-అపెర్చర్ లెన్స్ వస్తుంది. దీంతో లో-లైట్ ఫోటోలు బాగా వస్తాయి, న్యాచురల్ బోకెహ్ ఎఫెక్ట్ కూడా లభిస్తుంది. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ లో 5,100-5,200mAh బ్యాటరీ రాబోతోంది. ఇది ఐఫోన్ లో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద బ్యాటరీ! (iPhone 18 Pro launch date price)

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.