ఆధార్ కార్డుతో జాగ్రత్త: జిరాక్స్ సెంటర్లలో.. గుర్తు తెలియని వ్యక్తలకు చిక్కొచ్చు!?

  • ఆధార్ కార్డును ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించడం, జిరాక్స్ కాపీలు ఇవ్వడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆధార్ కార్డును పదే పదే వినియోగిస్తున్నారా? జిరాక్స్ కాపీలను ఇష్టానుసారంగా ఇస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే! మీ ఆధార్, ఫోన్ నంబర్ల ద్వారా సైబర్ నేరగాళ్లు మీ బ్యాంకు ఖాతాను ఖాళీ చేసే అవకాశం ఉంది. ఇటీవల వైజాగ్ కి చెందిన ఓ డిజైనర్ కి జరిగిన అనుభవమే ఇందుకు నిదర్శనం. సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి, ఆయన ఆధార్ నంబర్ సహా వ్యక్తిగత వివరాలు చెప్పి బెదిరించారు. దీంతో డిజైనర్ షాక్ అయ్యాడు. చాలా మంది డిజిటల్ సంతకంతో వచ్చే ‘ఇ-ఆధార్’ను గుర్తింపు కార్డుగా వాడుతున్నారు. దీనిపై ఫోన్ నంబర్ ఉండటం సైబర్ నేరగాళ్లకు మరింత సులువుగా మారుతుంది. దీని ద్వారా మీ బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి నిధులను కొట్టేసే ప్రమాదం ఉంది. మీ ఫోన్ నంబర్ ఉపయోగించి కొత్త సిమ్ కార్డును సృష్టించి, మీ అసలు సిమ్‌కు బ్యాంక్ ఓటీపీలు రాకుండా బ్లాక్ చేస్తారు. ఆ తర్వాత మీ ఖాతా నుంచి డబ్బులు కాజేస్తారు.

జాగ్రత్తలు తప్పని సరి!

  • ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకునేటప్పుడు, ప్రింట్ సరిగా రాకపోతే అక్కడే వదిలివేయకండి. మీరే స్వయంగా తీసుకోండి.
  • ఆధార్ కార్డులను అపరిచితులకు మెయిల్స్, వాట్సప్‌లో పంపవద్దు.
  • చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించే మాస్క్‌డ్‌ ఆధార్‌ను ఉపయోగించండి.
  • యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో పీవీసీ కార్డును బుక్ చేసుకుంటే, పోస్టు ద్వారా ఇంటికే వస్తుంది. ఇది క్యూఆర్ కోడ్‌తో సురక్షితంగా ఉంటుంది.
  • యూఐడీఏఐలో ఆధార్ బయోమెట్రిక్‌ను లాక్ చేసుకుంటే ఆన్‌లైన్ మోసాలను నివారించవచ్చు.
  • ఆధార్, బ్యాంకింగ్ అవసరాలకు ఉపయోగించే సిమ్‌ను వాట్సప్, టెలిగ్రామ్ వంటి వాటికి ఉపయోగించవద్దు. వాటి ద్వారా వచ్చే గుర్తుతెలియని లింక్‌లను క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు సైబర్ మోసాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *