- ఇండస్ట్రీ నుంచి కొంతకాలం దూరంగా ఉండాలని అభిషేక్ బచ్చన్ నిర్ణయం
- “ఇప్పటి వరకు ఇచ్చేశాను.. ఇక నాకోసం ఉండాలి” అంటూ స్పష్టమైన సందేశం
- తర్వాతి ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’పై కూడా ఆసక్తి పెరుగుతోంది
బాలీవుడ్‌లో అరుదుగా కనిపించే అభిషేక్ బచ్చన్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ భావోద్వేగ భరితమైన పోస్ట్ పెట్టారు. “కొన్ని రోజులు అన్నిటికీ దూరంగా ఉండాలనుకుంటున్నాను. నన్ను నేను తిరిగి తెలుసుకోవాలనిపిస్తోంది. ఇప్పటి వరకు నాకు ఇష్టమైన వారికోసం నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేశాను. ఇప్పుడు నాకోసం టైం కావాలి” అని ఆయన రాశారు. ఈ పోస్ట్ పట్ల అభిమానుల నుంచి స్పందన బాగానే వస్తోంది. “మీరు నటనకు విరామమా తీసుకుంటున్నారు?” అని కొందరు అడుగగా, “త్వరలో కొత్త అభిషేక్‌ని చూస్తామనుకుంటున్నా” అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
తాజా సినిమాలపై ఆసక్తి
అభిషేక్ చివరిసారిగా కనిపించిన చిత్రం ‘హౌస్‌ఫుల్ 5’. ఇది కామెడీ ఎంటర్‌టైనర్‌గా మంచి స్పందన పొందింది. ప్రస్తుతం ఆయన ‘రాజా శివాజీ’ అనే బయోపిక్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రితేశ్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహిస్తుండగా, జెనీలియా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.





