- అభిషేక్ బచ్చన్ నటించిన ‘బి హ్యాపీ’ మార్చి 14న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
- ఈ చిత్రం తండ్రి, కూతురు మధ్య అమితమైన ప్రేమను చూపుతుంది.
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ నటించిన ‘బి హ్యాపీ’ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమా మార్చి 14న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం చాలామంది హృదయాన్ని కదిలించేలా ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్‌తో పాటు అమితాబ్ బచ్చన్, నోరా ఫతేహి, ఇనాయత్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. నాసర్, జానీ లివర్, హర్లీన్ సేథి సహాయక పాత్రల్లో కనిపిస్తారు. రెమో డిసౌజా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై లిజెల్ రెమో డిసౌజా ఈ చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించారు.
ఈ సినిమా తండ్రి, కూతురు మధ్య ఉన్న అమితమైన ప్రేమను చూపుతుంది. ఒక తండ్రి తన కూతురి కలను నెరవేర్చడానికి ఎలా పోరాడాడు అనేది ఈ చిత్రం యొక్క కథ. కూతురు ధారా (ఇనాయత్ వర్మ) దేశంలోనే అతిపెద్ద రియాలిటీ షోలో డ్యాన్స్ చేయాలనే ఆశతో ఉంటుంది. కానీ, ఊహించని సంక్షోభం వల్ల వారిద్దరికి ఎదురయ్యే కష్టాలు ఏంటి? తన కూతురి ఆశయాన్ని నిజం చేసేందుకు ఆ తండ్రి ఏం చేశాడు? విధిని కూడా సవాల్ చేసిన ఒక తండ్రి కథే ‘బి హ్యాపీ’.ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా మార్చి 14న విడుదల కానుంది.






