‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) మన దైనందిన జీవితంలో కొత్తగా వింతలు చూపిస్తోంది. తాజాగా తెలుగు హీరోల మీద రూపొందించిన ఓ ఏఐ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో మన చిరంజీవి, బాలకృష్ణతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన అనేకమంది హీరోల యంగ్ అండ్ ప్రజెంట్ టుక్ ని పోల్చి చూపిస్తోంది.
ఎంతగానో ఆకట్టుకుంటున్న వీడియో
వయసులో ఉన్నప్పుడు వీరు ఎలా ఉన్నారు? ఇప్పుడెలా ఉన్నారు? అన్న ప్రస్తావనతో వీరి రూపాల్ని పోల్చుతూ రూపొందించిన ఈ వీడియో ప్రేక్షకుల ఆకట్టుకుంటోంది. తెలుగు సినీ అభిమానులు ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోను చూడాలనుకునే వారు నెట్టింట్లో ఒకసారి లుక్కేయడం మర్చిపోవద్దు.





