గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ (AI171) గురువారం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లో వైద్య కళాశాల సముదాయంపై కూలిపోయింది. 230 ప్రయాణికులు, 12 సిబ్బందితో 242 మందిని తీసుకెళ్తున్న ఈ విమానంలో ఒక్క ప్రయాణికుడు మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తండ్రిని చూసుకుంటానని మాటిచ్చిన సుమిత్, విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు!
సుమిత్‌కు 8,200 గంటల విమాన నడిపిన అనుభవం ఉందని DGCA తెలిపింది. ముంబైలో ఒంటరిగా ఉన్న తండ్రి, మాజీ DGCA అధికారి, వయోభారంతో బాధపడుతుండగా, సుమిత్ ఉద్యోగం మానేసి ఆయన్ను చూసుకోవాలని నిర్ణయించాడు. ఇటీవల తండ్రితో, “త్వరలో నీ దగ్గరే ఉంటా నాన్నా” అని చెప్పిన సుమిత్, ఈ ఘోరంలో చనిపోయాడని సన్నిహితులు కన్నీరుమున్నీరయ్యారు. సుమిత్ ఇద్దరు మేనళ్లులు కూడా పైలట్లే. ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుండర్‌కు 1,100 గంటల అనుభవం ఉంది, ఆయన తల్లి మాజీ ఎయిర్ ఇండియా కేబిన్ క్రూ. ప్రమాద కారణాలను తెలుసుకునేందుకు ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లను విశ్లేషిస్తున్నారు.





