🔸 ఎయిర్ ఇండియా AI-2469 విమానం పూణేలో ల్యాండ్ అయిన వెంటనే పక్షి ఢీకొన్న ఘటన
🔸 తిరిగి ఢిల్లీకి వెళ్తుండగా ఫ్లైట్ రద్దు
🔸 ప్రయాణికుల కోసం ఎయిర్ ఇండియా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా AI-2469 విమానం 100 మందికిపైగా ప్రయాణికులతో 5:31కి బయలుదేరి, 7:14కి పూణే ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. కానీ ల్యాండ్ అయిన తర్వాత విమానానికి పక్షి ఢీకొన్నట్లు ఎయిర్ ఇండియా అధికారికంగా ధృవీకరించింది.
దీంతో, అదే విమానం తిరిగి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్య ఫ్లైట్ను రద్దు చేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎయిర్‌బస్ A320 విమానాన్ని ఆపి విస్తృత తనిఖీలు ప్రారంభించారు. ఈ అనుకోని అవాంతరం వల్ల ప్రయాణికులకు ఏర్పడిన అసౌకర్యం పట్ల ఎయిర్ ఇండియా క్షమాపణ తెలిపింది. విమానం టికెట్ కెన్సలేషన్‌పై పూర్తి రీఫండ్, లేదా ఆప్షనల్ కాంప్లిమెంటరీ రీషెడ్యూల్ ఆఫర్ చేస్తామని స్పష్టం చేసింది. ఇతర విమానాల్లో లేదా బస్సుల్లో ప్రయాణికులను ఢిల్లీకి చేరేలా చేయడం కోసం కృషి జరుగుతోంది. “మా ప్రయాణికుల భద్రతే మాకు ప్రథమ ప్రాధాన్యత” అని సంస్థ ప్రతినిధి ఒక ప్రకటనలో చెప్పారు.





