గ్రహాంతరవాసుల మాటలు అప్పుడే వినిపిస్తాయట!

  • గ్రహాంతరవాసుల సిగ్నల్స్ పై కొత్త అధ్యయనం.
  • గ్రహాలన్నీ ఒకే వరుసలో ఉన్నప్పుడే వినే అవకాశం.
  • భూమి, అంగారకుడిని అలైన్ చేస్తూ ప్రయత్నిస్తే వినేందుకు ఎక్కువ అవకాశం.

బయటి ప్రపంచంలో గ్రహాంతరవాసులు ఉన్నారా? ఉంటే వారు మనతో ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ, పెన్ స్టేట్, నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని కనుగొన్నారు. గ్రహాలు ఒకే వరుసలో ఉన్నప్పుడు ఏలియన్స్‌కు సంబంధించిన సిగ్నల్స్‌ను వినడానికి ఉత్తమ సమయమని ఒక అధ్యయనంలో తేలింది.

అధ్యయనం ఏం చెబుతోంది?

శాస్త్రవేత్తలు గత 20 ఏళ్ల నాసా డీప్ స్పేస్ నెట్‌వర్క్ డేటాను విశ్లేషించారు. దాని ప్రకారం, భూమి, అంగారకుడు (Mars) ఒకే సరళరేఖలో ఉన్నప్పుడు, గ్రహాంతరవాసులు మన రేడియో ప్రసారాలను గుర్తించే అవకాశం 77% ఉంటుంది. సాధారణంగా ఇతర సమయాల్లో ఈ అవకాశం కేవలం 12% మాత్రమే. అంటే, గ్రహాల స్థానం కమ్యూనికేషన్‌పై పెద్ద ప్రభావాన్ని చూపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఎక్సోప్లానెట్స్ పై దృష్టి..

పరిశోధకుల ప్రకారం, గ్రహాలు ఒకదానికొకటి ఒకే వరుసలో ఉండే ఎక్సోప్లానెట్ వ్యవస్థలు, ముఖ్యంగా భూమికి ఎదురుగా ఉన్నవి, ఏలియన్ సందేశాలను వినడానికి చాలా అనువైన ప్రదేశాలు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, సెటి (SETI) పరిశోధకులు సమీపంలోని (సుమారు 23 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న) వ్యవస్థలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎందుకంటే గ్రహాంతరవాసులు కూడా ఇలాంటి కమ్యూనికేషన్ టెక్నిక్‌లను వాడొచ్చు. ఈ కొత్త పద్ధతి రేడియో తరంగాలకు మాత్రమే కాకుండా లేజర్ సిగ్నల్స్ కు కూడా వర్తిస్తుంది. దీంతో విశ్వంలో గ్రహాంతరవాసుల నుంచి వచ్చే సంకేతాలను కనుగొనడానికి మరిన్ని మార్గాలు అందుబాటులో వచ్చినట్లు అవుతుంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *