‘ది హాలీవుడ్ రిపోర్టర్’ కవర్‌పై అల్లు అర్జున్: అరుదైన ఘనత సాధించిన ఐకాన్ స్టార్!

  • ‘పుష్ప-2’తో ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన అల్లు అర్జున్, ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ కవర్‌లో ప్రథమంగా కనిపిస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ‘పుష్ప-2’తో భారీ విజయం సాధించారు. ఈ సినిమా ద్వారా ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో, బన్నీ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రతిష్టాత్మక సినిమా మ్యాగజైన్ ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ ఇప్పుడు ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ పేరుతో భారత్‌లో అడుగుపెట్టింది. ఈ మ్యాగజైన్ తొలి సంచికలో అల్లు అర్జున్ ఫొటోతో రానుంది. ఇటీవల కవర్ పేజ్‌ను రివీల్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటో షూట్ కూడా నిర్వహించారు. “ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాను. నా జీవితంలో లభించిన అతిపెద్ద అవకాశం ఇదే” అని బన్నీ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. “బలం, ఆత్మవిశ్వాసం అనేవి మనసులో ఉంటాయి. వాటిని ఎవరూ తీసేయలేరు” అని ఆయన అన్నారు.

“జీవితంలో సక్సెస్ అయిన తర్వాత కూడా ఎలాంటి గర్వం లేని చాలా మందిని నేను చూశా. నేను 100 శాతం సామాన్యుడినే” అని తెలిపారు. “సినిమా చేస్తున్నప్పుడు కూడా ఇదే భావనతో ఉంటాను” అని ఆయన చెప్పారు. ‘అల్లు అర్జున్: ది రూల్’ పేరుతో ఈ ఆర్టికల్ ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’లో రానుంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప-2’ గతేడాది 5న విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. రష్మిక మంధన్నా హీరోయిన్‌గా నటించగా, ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో ఉన్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసి వరల్డ్‌వైడ్‌గా రూ.1871 కోట్లు వసూల్ చేసింది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *