అనకాపల్లి రైల్వే వంతెన కుంగింది.. 8 రైళ్ల నిలిపివేత!

  • భారీ వాహనం ఢీకొట్టడంతో రైల్వే ట్రాక్ దెబ్బతింది
  • విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం

అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో రైల్వే వంతెన కుంగిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం రాత్రి ఓ భారీ వాహనం గడ్డర్‌ను ఢీకొట్టడంతో అండర్‌ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది. ఫలితంగా అధికారులు 8 రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. రైల్వే సిబ్బంది దెబ్బతిన్న ట్రాక్‌ను మరమ్మతు చేస్తున్నారు. అయితే, మరో ట్రాక్ ద్వారా విశాఖ-విజయవాడ రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. కశింకోట వద్ద గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లు, ఎలమంచిలిలో మహబూబ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. అధికారులు సమస్యను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *