మద్యం కుంభకోణం: సజ్జల శ్రీధర్‌రెడ్డికి రిమాండ్, జైలుకు తరలింపు!

మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్‌రెడ్డికి ఏసీబీ కోర్టు మే 6 వరకు రిమాండ్ విధించింది. సిట్ అధికారులు ఆయన్ను విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని శ్రీధర్‌రెడ్డి ఈ కేసులో కీలక నిందితుడు. అయితే, కేసులో ఏ6గా ఉన్న ఆయన్ను శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో అరెస్టు చేశారు. దీంతో, శనివారం విజయవాడకు తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు.

సజ్జల శ్రీధర్‌రెడ్డి మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించారు. ముడుపుల కోసం జరిగిన సమావేశాల్లో ఆయన ఉన్నారు!” – సిట్ అధికారులు.

2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక కొత్త మద్యం విధానం పేరుతో కుంభకోణం జరిగింది. ఇదిలా ఉంటే, నెలకు రూ.50-60 కోట్ల ముడుపుల కోసం సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో శ్రీధర్‌రెడ్డితో పాటు వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, రాజ్ కెసిరెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేకాధికారి సత్యప్రసాద్ పాల్గొన్నారు. అంతేకాదు, ఈ కేసులో రూ.4,000 కోట్ల అవకతవకలు జరిగాయని సిట్ ఆరోపిస్తోంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *