ఏపీ ఫైబర్‌నెట్: చౌకగా ఇంటర్నెట్ రూ.149 ప్లాన్ మళ్లీ అందుబాటులోకి!!

రాష్ట్ర ప్రభుత్వం రూ.149 బేసిక్ ప్లాన్‌ను మళ్లీ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి కొత్త కార్యాచరణ అమల్లోకి రానుంది.

రాష్ట్రంలో ఇంటింటికీ కేబుల్ టీవీ, ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్‌కు చౌకగా అందించే ఫైబర్‌నెట్ మళ్లీ ప్రజాదరణ చూరగొనేందుకు శక్తియుక్తులు కూడగడుతోంది. రూ.149 బేసిక్ ప్లాన్‌ను మళ్లీ ప్రవేశపెట్టి రాష్ట్రంలో కోటిమందికి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ నుంచి సరికొత్త కార్యాచరణ అమల్లోకి తెచ్చేలా రంగం సిద్ధమవుతోంది. 2017లో చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టు ఏపీ ఫైబర్‌నెట్, ఇంటర్నెట్, కేబుల్, ల్యాండ్ ఫోన్ సేవలను ఒకే కనెక్షన్‌గా అందించి ప్రజలకు ఉపయోగపడింది. (Andhra Pradesh Fiber Net, Internet Services)అప్పట్లో 17 లక్షల కనెక్షన్లు ఇచ్చిన ఈ ప్రాజెక్టు, వైఎస్సార్సీపీ హయాంలో కాస్తా 5 లక్షలకు దిగజారింది.

గత ప్రభుత్వ నేతల అవినీతి కారణంగా సంస్థ పీకల్లోతు అప్పుల్లో ముంచబడింది. మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఫైబర్‌నెట్‌కు పూర్వవైభవం తేవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, సంస్థ ఛైర్మన్ జీవీరెడ్డి కనెక్షన్ల సంఖ్యను కోటికి పెంచడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించారు.(FiberNet Expansion Plans)గత ప్రభుత్వం పెంచిన ప్లాన్‌ల ధరలు తగ్గించి నెలకు రూ.149 బేసిక్ ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. కొత్త సాంకేతికత, మానవ వనరులు సమకూర్చుకోవాలని నిర్ణయించారు. విద్యా సంస్థల్లోనూ ఫైబర్‌నెట్ సేవల్ని విస్తరించాలని భావిస్తున్నారు. 

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *