- 2024 డిసెంబర్ 31 నుంచి అమల్లోకి రద్దు నిర్ణయం
- మున్సిపల్ చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం – గవర్నర్ అనుమతి
నగరాలు, పట్టణాల్లో ప్రజలకు భారంగా మారిన చెత్త పన్ను రద్దు చేయబడింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసి, 2024 డిసెంబర్ 31 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందని తెలిపింది. 2021 నవంబర్‌లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం 40 పుర, నగరపాలక సంస్థల్లో చెత్త పన్నును ప్రవేశపెట్టింది. దీంతో రూ. 187.02 కోట్ల వరకు వసూలు చేశారు. అయితే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో 2024 డిసెంబర్‌లో కూటమి ప్రభుత్వం మున్సిపల్ చట్ట సవరణ తీసుకొచ్చి, అసెంబ్లీ ఆమోదం పొందింది. తాజాగా, గవర్నర్ అనుమతి, గెజిట్ ప్రకటన తర్వాత ప్రభుత్వం సెక్షన్ 170-బి (1965 మున్సిపల్ చట్టం), 491-ఎ (1955 మున్సిపల్ కార్పొరేషన్ చట్టం) తొలగించినట్లు స్పష్టమైన నోటిఫికేషన్ ఇచ్చింది.






