ఏపీ ఇంటర్‌ విద్యలో సంస్కరణలు: ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లేవ్!!

ఇంటర్మీడియట్‌ విద్యలో కీలక మార్పులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. విద్యార్థులకు ఉత్తమమైన శిక్షణను అందిస్తూ, జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సమర్థతను పెంచే విధంగా పలు ప్రతిపాదనలు రూపొందించినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఈ ప్రతిపాదనలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సూచనలు స్వీకరిస్తామని ఆమె స్పష్టం చేశారు. జాతీయ విద్యావిధానాన్ని (NEP) అనుసరించి విద్యా వ్యవస్థలో మార్పులు చేస్తామని ఆమె తెలిపారు. 2024-25 విద్యాసంవత్సరం నుండి పదో తరగతిలో ఎన్‌సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు అమలు చేయగా, 2025-26లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరానికి కూడా అదే విధానం తీసుకొస్తారు. ఈ మార్పులు విద్యార్థులకు నీట్‌, జేఈఈ వంటి జాతీయస్థాయి పరీక్షలకు మరింత అందుబాటులో ఉండేలా చేస్తాయని శుక్లా అన్నారు.

మార్పులలో భాగంగా:

  • ఇంటర్‌ మొదటి సంవత్సర బోర్డు పరీక్షలు రద్దు చేయనున్నారు.
  • కళాశాలలే అంతర్గత పరీక్షలు నిర్వహిస్తాయి.
  • ఇంటర్‌ ద్వితీయ సంవత్సర బోర్డు పరీక్షలను మాత్రం యథావిధిగా కొనసాగిస్తారు.
  • సిలబస్‌ దృక్పథంలో సంస్కరణలు, కొత్త సబ్జెక్ట్‌ కాంబినేషన్లు ప్రవేశపెట్టనున్నారు.

ప్రస్తుతానికి 15 రాష్ట్రాల్లో ఎన్‌సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు అమలవుతున్నాయని, అదే విధానాన్ని ఏపీ కూడా అనుసరిస్తోందని ఆమె చెప్పారు. ప్రతిపాదిత సంస్కరణల వివరాలు ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీ లోపు అందరూ తమ సలహాలు, సూచనలు పంపాలని కోరారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *