ఆపిల్ ‘మ్యాక్‌బుక్ నియో’.. బడ్జెట్ ధరలో ‘AI’ పవర్!

Apple MacBook Neo Price India Features A18 Pro AI
  • కేవలం రూ. 69,900 ప్రారంభ ధరతో ఆపిల్ చరిత్రలోనే అత్యంత చౌకైన ల్యాప్‌టాప్.
  • ఐఫోన్ 16 ప్రో లో వాడే ‘A18 Pro’ చిప్‌తో AI పనుల్లో అద్భుత వేగం.

ఆపిల్ ప్రొడక్ట్ కొనాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సిందే అన్న అపోహను చెరిపివేస్తూ.. విద్యార్థులు, సామాన్యుల కోసం పిల్ తన పంథా మార్చుకుంది. సాధారణంగా వేలల్లో దొరికే విండోస్ ల్యాప్‌టాప్‌లకు గట్టి పోటీనిస్తూ, ప్రీమియం ఫీచర్లతో కూడిన ‘మ్యాక్‌బుక్ నియో’ (MacBook Neo) ను మార్కెట్లోకి తెచ్చింది. (Apple MacBook Neo Price India)

ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో మొదటిసారిగా ఐఫోన్ ప్రో సిరీస్ చిప్ అయిన A18 Proని వాడారు. దీనివల్ల ఏఐ (AI) పనులు, ఫోటో ఎడిటింగ్ వంటివి గతంలో కంటే 3 రెట్లు వేగంగా జరుగుతాయి. 13 అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లే, 500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. కేవలం 1.23 కేజీల బరువుతో ఉండే ఈ ల్యాప్‌టాప్, నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో (బ్లష్, ఇండిగో, సిల్వర్, సిట్రస్) అందుబాటులోకి వచ్చింది.

బ్యాటరీ మొనగాడు.. స్టూడెంట్లకు స్పెషల్ డిస్కౌంట్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 16 గంటల పాటు బ్యాటరీ లైఫ్ వస్తుందని ఆపిల్ పేర్కొంది. ఫ్యాన్ లేని డిజైన్ (Fanless design) కావడంతో ఇది ఎలాంటి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా పనిచేస్తుంది. విద్యార్థుల కోసం ఆపిల్ ప్రత్యేకంగా రూ. 59,900 కే దీనిని ఆఫర్ చేస్తోంది. అయితే, ఇందులో కనీస ర్యామ్ (8GB) ఉండటం, బయోమెట్రిక్ సెక్యూరిటీ కేవలం హై-ఎండ్ వేరియంట్లలోనే ఉండటం గమనార్హం.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *