అరకు వ్యాలీలో 1,736 మంది గిరిజనులకు రహదారుల సమస్య పరిష్కారం!

అల్లూరి సీతారామరాజు జిల్లాలో, అరకు వ్యాలీ మండలం, చినలబుడు మరియు పద్మాపురం గ్రామాలలో పక్కనకుడి, మంజాగూడ, తుడుము, మాలివలస, రణజిల్లేడ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకుండా ఉంది. ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan ఆదేశాలతో MGNREGS నిధులతో 2.70 కిలోమీటర్ల తారురోడ్డును నిర్మించారు. ఈ రహదారి ద్వారా 1,736 మంది గిరిజనులకు రాకపోకలు సులభమవుతాయి. ఇది రణజిల్లేడ వాటర్ ఫాల్స్ కు వెళ్లే మార్గంగా ఉంటుంది. ఈ మార్పు వల్ల గ్రామాలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. విద్య, వైద్యం మరియు వ్యాపార వసతులకు చేరువ అవుతారు. ఇప్పటికే BT రోడ్డు 2.60 కిలోమీటర్లు పూర్తయ్యాయి. రవాణా సౌకర్యం కల్పించబడింది. మిగిలిన 100 మీటర్ల మార్గాన్ని CC అప్రోచ్ సబ్ బేస్ వేయడం జరిగింది. కన్సాలిడేషన్ తర్వాత సీసీ రోడ్డు పూర్తి చేసి, గిరిజనుల రహదారి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం అందిస్తామని అధికారులు తెలిపారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *