ధోనీ ఇచ్చిన ‘సర్‌ప్రైజ్ గిఫ్ట్’.. మళ్లీ CSKకి అశ్విన్!

  • చెన్నై జట్టులోకి తిరిగి రానున్న రవిచంద్రన్ అశ్విన్
  • ధోనీ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన అశ్విన్

వందో టెస్టులో ధోనీ చేతులమీదుగా మెమొంటో అందుకోవాలని ఆశించిన అశ్విన్, అప్పట్లో అది సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) జట్టులో చేరడం తనకు పెద్ద గిఫ్ట్ లాంటిదని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత ఐపీఎల్‌లో అతనికి ఇదే తొలి సీజన్ కావడం విశేషం.

CSK తుది జట్టులో పోటీ తీవ్రం

స్పిన్ విభాగంలో ఇప్పటికే రవీంద్ర జడేజా ఉండగా, ఇప్పుడు అశ్విన్ జతకలుస్తే CSKకి మరింత బలం. అయితే, అఫ్గాన్ యువ స్పిన్నర్ నూర్ అహ్మద్, రచిన్ రవీంద్ర లాంటి ఆల్‌రౌండర్లతో తుది జట్టులో స్థానం కోసం పోటీ తీవ్రంగా ఉంది. డేవన్ కాన్వే ఓపెనింగ్‌లో ఉండటంతో రచిన్‌ను మిడిలార్డర్‌కే పరిమితం చేసే అవకాశముంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *