డిసెంబర్ 10 నుంచి ఆస్ట్రేలియాలో కొత్త చట్టం అమల్లోకి వస్తోంది. 16 ఏళ్ల లోపు పిల్లలు ఇకపై Instagram, TikTok, YouTube వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అకౌంట్లు కలిగి ఉండరాదు! ఇప్పటికే మెటా (Meta) యాప్స్.. Instagram, Facebook, Threads లాంటి ప్లాట్‌ఫామ్స్.. లక్షలాది టీనేజర్ల అకౌంట్లను డీయాక్టివేట్ చేయడం మొదలుపెట్టాయి. ఈ చట్టం పేరే Online Safety Amendment (Social Media Minimum Age) Bill 2024. ప్రధాన ఉద్దేశ్యం – పిల్లల్ని సోషల్ మీడియా వ్యసనం, సైబర్ బుల్లీయింగ్, ఆన్‌లైన్ మానసిక ఒత్తిళ్ల నుంచి రక్షించడం.
ఇది కేవలం పిల్లలకో, తల్లిదండ్రులకో కాదు.. బాధ్యతను పూర్తిగా సోషల్ మీడియా కంపెనీలపై ఉంచింది ప్రభుత్వం. 16 ఏళ్ల లోపు యూజర్లు తమ ప్లాట్‌ఫామ్‌లో ఉన్నా, తగిన చర్యలు తీసుకోకపోతే కంపెనీలకు A$49.5 మిలియన్ (₹270 కోట్లు) వరకు ఫైన్ పడుతుంది! మెటా వంటి కంపెనీలు ఈ నిర్ణయానికి మొదట వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు “లీగల్ కంప్లైయెన్స్” పేరుతో పూర్తిగా సహకరిస్తున్నాయి.
“ఇది బాన్ కాదు… డిలే మాత్రమే!”
ఆస్ట్రేలియా ప్రభుత్వం దీనిని “సోషల్ మీడియా డిలే” అని పిలుస్తోంది — మద్యం, డ్రైవింగ్, సిగరెట్లపై వయసు పరిమితిలాగా ఇదీ ఒక రక్షణ చర్య అని చెబుతోంది. దేశంలోని 13–15 ఏళ్ల వయసు గల సుమారు 4 లక్షలకుపైగా టీనేజ్‌ర్స్ Snapchat, 3.5 లక్షల మంది Instagram వాడుతున్నారని eSafety కమిషన్ వెల్లడించింది.
అనేక కుటుంబాలు సోషల్ మీడియా వల్ల పిల్లల్లో మానసిక ఒత్తిడి, డిప్రెషన్ పెరిగిందని చెబుతున్నాయి. కొందరు తల్లిదండ్రులు సోషల్ మీడియా కారణంగా పిల్లల ప్రాణాలు పోయిన ఘటనలను ప్రస్తావిస్తూ ఈ చట్టానికి మద్దతు ఇచ్చారు.
అయితే, టీనేజర్లు మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. 9–16 ఏళ్ల వయసులో ఉన్న పిల్లల సర్వేలో 75% మంది “బాన్ వర్క్ అవ్వదు” అన్నారు. కొంతమంది 15 ఏళ్ల విద్యార్థులు “ఇది మా ఫ్రీడమ్‌పై దాడి” అంటూ కోర్టు లో సవాల్ చేశారు. టెక్ కంపెనీలు కూడా “ఇది హడావుడిగా తీసిన నిర్ణయం” అని, తమ ప్లాట్‌ఫామ్‌లలో ఇప్పటికే ఉన్న పేరెంటల్ కంట్రోల్స్ ద్వారా పిల్లల్ని సేఫ్‌గా ఉంచవచ్చని చెబుతున్నాయి.

ఇప్పుడు ప్రశ్న ఇదే..
సోషల్ మీడియా బాన్ పిల్లలను కాపాడుతుందా? లేక వారిని ‘అనధికార ఆన్‌లైన్ ప్రపంచం’ వైపు నెడుతుందా?మరిన్ని డిజిటల్ అప్‌డేట్స్ కోసం ఫాలో అవ్వండి @DailyDiscover





