- ఫిబ్రవరి 19న బీజేపీ శాసనసభాపక్ష సమావేశం
- రామ్లీలా మైదానంలో భారీ ప్రమాణ స్వీకార వేడుక
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై సన్నాహాలు ముమ్మరం అయ్యాయి. ఫిబ్రవరి 19న బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిపి నూతన ముఖ్యమంత్రి ఎంపిక చేయనున్నారు. అనంతరం ఫిబ్రవరి 20న ప్రమాణ స్వీకారం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేసులో న్యూదిల్లీ ఎమ్మెల్యే పర్వేశ్ వర్మ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అశీష్ సూద్, రేఖా గుప్తా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈసారి రెండు ఉప ముఖ్యమంత్రుల నియామకం కూడా ఉండొచ్చు. రెండున్నర దశాబ్దాల తర్వాత దిల్లీలో అధికారం చేపట్టనున్న నేపథ్యంలో రామ్లీలా మైదానంలో భారీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు, పారిశ్రామికవేత్తలు, సినీ తారలు, క్రికెటర్లు, సాధువులు హాజరయ్యే అవకాశం ఉంది.





