బాలీవుడ్లో మాజీ ప్రియులు, ప్రియురాళ్లు ఎప్పుడూ హాట్ టాపిక్. అలాంటి ప్రముఖులు, వారి గత సంబంధాలను ఆధారంగా చేసుకొని AI ద్వారా రూపొందించిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయా ప్రముఖుల ఎక్స్ లవర్స్ ఫోటోలతో పాటు కనిపిస్తారు.. వాటిని చూసిన వారి ప్రస్తుత జీవిత భాగస్వాములు ఎలా స్పందిస్తారో క్రియేటివ్‌గా చూపించారు. ఈ వీడియోపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ, “ఇంతకంటే క్రియేటివ్ కంటెంట్ బాలీవుడ్లో ఉందా?” అంటూ తన స్వాగ్ స్టైల్లో ట్వీట్ చేశారు. ఆయన ఈ వీడియోను షేర్ చేయడంతో నెట్టింట్లో ఇది వేగంగా వైరల్ అవుతోంది.





