• బ్రిటన్ గూఢచార సంస్థ MI6 చీఫ్‌గా బ్లైస్ మెట్రీవెలి
• 1909లో స్థాపితమైన MI6కి మహిళా డైరెక్టర్‌గా ఇది తొలి సారి
బ్రిటన్ గూఢచార సంస్థ MI6కి చీఫ్‌గా బ్లైస్ మెట్రీవెలి నియమితులయ్యారు. 47 ఏళ్ల బ్లైస్ జూలై 2025 నుంచి విధుల్లోకి వస్తారు. ఈ విషయం ను ఆదివారం ప్రధాని కీర్ స్టార్మర్ అధికారికంగా ప్రకటించారు. బ్రిటన్ ఇంటెలిజెన్స్ చరిత్రలో మహిళా డైరెక్టర్‌గా నియమితులవడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు బ్లైస్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్లలో కీలక భూమిక పోషించారు. బ్లైస్ నియామకం బ్రిటన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో లింగ సమానత్వానికి ఓ మెరుగైన అడుగుగా భావిస్తున్నారు. ‘‘ఇది ఒక చారిత్రాత్మక బాధ్యత. దేశ భద్రత కోసం మా వంతు పాత్రను నిబద్ధతగా నిర్వహిస్తా’’ అని బ్లైస్ పేర్కొన్నారు. MI6ను మరింత ఆధునికంగా మార్చే బాధ్యత ఆమెపై ఉంది.





