
‘హే.. చెర్రీ నీకేదో ఉత్తరం వచ్చింది!’ అనగానే..
‘వాట్.. ఈ రోజుల్లో లెటరా? అదీ.. చెర్రీ గాడిగా!!’ అంటూ ఆపీస్లో వాళ్లంతా ఒక్కసారి గా లేచారు..
‘నాకు లెటరేంట్రా.. సరిగ్గా చూడు. వేరే ఏ చాగంటి శ్రీనివాసరావుగారికో అయ్యుంటుంది’
‘లేదు మిస్టర్.. ఫ్రంమ్ యువర్ సిస్టర్!!’ అనగానే..
‘మా చెల్లా.. అదో పెద్ద ఫిట్టింగ్ మాస్టర్. ఏదో ప్లాన్ చేసుంటది. రాఖీ రేపే కదా. ఇటివ్వు’ అని లెటర్ అందుకున్నాడు చెర్రీ..
రేయ్.. అన్నయ్యా!! నీకు గుర్తుందా? టెక్స్ట్ మెసేజ్, వాట్సాలు లేవప్పుడు.. అరుగుపైనే నువ్వు, నేనూ.. చెప్పుకున్న విక్రమార్కుడు, బేతాళుడు కథలు నాకు ఇంకా గుర్తున్నాయ్. ఏమోజీలు ఎరుగం అప్పుడు.. ‘అబ్బా.. వదులే రాక్షసీ!!’ అని అరిచిన నీ ముఖమే నాకు ఇస్టమైన మొదటి ఏమోజీ!! అమెజాన్ లు, ఆన్ లైన్ డెలివరీలు మనకేం తెలుసప్పుడు.. ‘ఆయ్.. ముంజు బుర్రల బండి’ అని నువ్వు తయారు చేసినచ్చిన బండే నా ఫస్ట్ గిఫ్ట్ డెలివరీ!!స్విగ్గీలు.. జోమాటోల ప్యాకేజీ ఫూడ్ లు లేవు కదా మనికి.. ‘అన్నా.. నాకు కొంచెం పెట్టవా’ అని అమ్మ పాయసాన్ని ప్రేమగా పంచుకోవడం నా బెస్ట్ షేరింగ్ మూవెంట్.. అన్నాయ్యా.. నీకు ఇవన్నీ గుర్తున్నాయా? ప్లీజ్ రా.. నాకు ఆ అన్నయ్య, ఆలాంటి మూమెంట్స్ కావాలి. కనీసం.. ఏడాదికి ఒక్క రోజైనా.. అదీ ఈ రాఖీ పండకైనా.. అందుకే ఇలా లెటర్ రాస్తున్నా.. నువ్వు పెట్టిన అన్ని ఆన్ లైన్ డెలరీవరీలు క్యాన్సిల్ చేసి ఇంటికి రా.. ప్లీజ్ అన్నా!!ఆఫ్ లైన్ లో.. ఓ రోజంతా గడుపుదాం. నీ కోసం ఎదురు చూస్తుంటా!!’
చదువుతుండగానే.. చెర్రీ కళ్లలో నీళ్లు. అవి బాధతోనో.. ఆనంతోనో కాదు. సాసరు అంత పేపర్.. ఓ ఓ దొసెడన్ని అక్షరాలు.. పాకేతికేళ్లు వెనక్కి క్షణాల్లో తీసుకెళ్లినందుకు. తన చెల్లి ఏదో ఫిట్టింగ్ పెట్టింది అనుకున్నాగానీ.. క్యాలెండర్ గడుల్లో ఎప్పుడో తను భద్రంగా దాచుకున్న గ్నాపకాల్ని ఇంతిలా పేపర్ పై ఫిట్ చేసి పంపుతుందని అనుకోలేదు చెర్రి. ఫోన్ కి వచ్చిన అమెజాన్ నోటిఫికేషన్ ని చూసి.. నవ్వుకుని.. మళ్లీ లెటర్ చదవసాగాడు..
‘పోయిన సారి.. నువ్వు అమెజాన్ లో పంపిన ఫోన్ తో నీ కోడలు ఆటలు ఆడుతోంది.. హెడ్ సెట్ తో నీ బుజ్జి అల్లుడు పాటలు వింటున్నాడు.. వీళ్ల వయసులో మనం ఎలా ఆడుకునే వాళ్లమో గుర్తుందా అన్నయ్యా.. అప్పుడు నా వల్ల నీ కంటి పక్కనే తగిలిన గాయం. అప్పుడు నాకెంత బయమేసిందో.. నువ్వు నా వల్లే అని చెబితే నాన్నా నన్నేం చేస్తారో అని భయపడిపోయా? కానీ, నువ్వు ‘నేనే నగిలించుకున్నా..’ అని చెబుతూ నా వైపు చూడడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. చెల్లిని బరించడం అన్నకి బై డీఫాల్ట్ ఫీచరేమో.. లేకపోతే ఆ వయసులో నువ్వెందుకు అలా చెప్తావ్? నేను అప్పుడే అనుుకున్నా.. మా అన్నగాడు ఎంతైనా గ్రేట్ అని. కానీ, నీకెప్పుడూ ఇలాపైకి చెప్పలేదురా.. ఆ కలిసి ఆడిన ఆటల్లోని ఎమోషన్స్ ఇంకా నా అన్నని నాతోనే ఉంచాయి. కానీ, ఇప్పుడు నా పిల్లల్ని.. నేటి తరాన్ని చూస్తుంటే చెప్పాలి అనిపించింది. ఏంట్రా.. ఇది ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతోంది అని ఆలోచిస్తున్నావ్ కదూ.!!’ చెర్రి ముఖంలో చిరునవ్వు.
ఇంతలో చెర్రి ఫోన్ కి మరో నోటిఫికేసన్.. అది మిత్రా నుంచి. పక్కకి స్వైప్ చేసి. ఆలోచనలో పడ్డాడు.. కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసినప్పుడు చెల్లి ఏడుపులోగానీ.. పిల్లలు పుట్టి అమ్మ అయినప్పుడుగానీ.. వాళ్లని సాకేటప్పుడుగానీ.. ఆశ్చర్యపడేవాడిని.. నాతో పెరిగిన రాక్షసి ఎన్నో బాధ్యతలు మోస్తూ.. బిజీగా ఉంటుందిలే అనుకునే వాడిని. కానీ, ఇంకా ఈ అన్నని తన మనసులో పదిలంగానే ఉంచుకోవడం అంటే.. అది ఒక్క చెల్లెళ్లకే తెలిసిన ఏమోషన్ ఏమో.. అనుకుంటూ.. మళ్లీ లెటర్ని తడుముతూ.. చదవసాగాడు.
‘నవ్వకు.. నేను చెప్పేది నిజం. ఈ కాలంలో అంతా విర్చువల్ గానే ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అంతెందుకు.. గత ఆరేడేళ్లుగా నువ్వేం చెస్తున్నావ్. రాఖీ వచ్చిందంటే.. ఆన్ లైన్ ఏదో నాకిష్టమని ఆర్డర్ పెట్టేస్తున్నావ్. వీడియో కాల్ చేసి.. ఏంటి కబుర్లు అంటావ్. ఇంకా.. లోకం గురించి చెప్పాలంటే నాకు మాటలు సరిపోవ్. ఈ కాలం తోబుట్టువులకి అరుగుల్లెవ్.. ఆ బేతాళుడూ రాడు.. ఆరంగుళాల తెరపైనే మాటలు.. 50 అంగుళాల టీవీలోనే ఓటీటీ కథలు.. అంతేనా? నువ్వూ నేనూ.. కూర్చుని.. నా పిల్లలలు చెబుదాం.. మనం ఎలా ఆడుకున్నామో.. ఎలా కొట్టుకున్నామో.. తగిలిన దెబ్బల రూపంలో గుర్తున్న తీయన గ్నాపకాల్ని వాళ్లతో పంచుకోవాలి.. అలాగైనా.. నా కూతురికి దాని అన్నపై.. కొడుక్కి వాడి చెల్లిపై.. ఓ ట్రూ ఎమోషన్ డెవలప్ అవుతుంది. ఏమంటావ్? వచ్చెయ్ మరి… ఎదురు చూస్తుంటా. సర్లేగానీ.. పెట్టిన ఆర్డర్లు ఏవీ క్యాన్సల్ చేయకు!! ఎమోషన్ లో!!
ఇట్లు.. నీ రాక్షసి!! ’
నవ్వుకుంటూ.. లెటర్ని ఫోల్డ్ చేసి జేబులో పెట్టుకుని.. ఫోన్ తీసి చెల్లికి పెట్టిన ఒక్కో ఆర్డర్ స్టేటస్ చెక్ చేశాడు. చెల్లెలు ఊరికి టిక్కెట్టు బుక్ చేశాడు. ఉరుకుల పరుగుల జీవితంగా బిజీ అయిపోయిన అన్న… ఆఫ్ లైన్ లో ప్రేమని పంచేందుకు వెళ్తున్నాడు. తనలో చెల్లెలితో గడిపిన ఎన్నో గ్నాపకాలు.. ఇవి తనొక్కడివేకాదు. రాఖీని జరుపుకునే ప్రతి తోబుట్టువులోనూ ఉన్నాయి. పదండి.. తోబుట్టువుకి రక్ష వర్చువల్ గా కాకుండా.. వెళ్లి కడదాం. వెన్నేంటే ఉందాం!!





