- దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు
- పీఎం ఆరోగ్య యోజన కింద గిగ్ వర్కర్లకు హెల్త్ కార్డులు, గుర్తింపు కార్డులు
- ఈ-శ్రమ్ పోర్టల్లో గిగ్ వర్కర్ల నమోదు
- పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా
- కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం
- వచ్చే ఐదేళ్లలో 75,000 కొత్త మెడికల్ సీట్లు
- 36 ఔషధాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగింపు
ఆరోగ్య రంగానికి కేంద్ర బడ్జెట్ బూస్ట్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, క్యాన్సర్ చికిత్స, గిగ్ వర్కర్ల ఆరోగ్యం, మెడికల్ విద్యా విస్తరణ కోసం కీలక ప్రణాళికలను ప్రకటించారు. దేశంలోని ప్రతి జిల్లాలో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా తక్కువ ఖర్చుతో క్యాన్సర్ రోగులకు చికిత్స అందించే అవకాశం ఉంది. పీఎం ఆరోగ్య యోజన కింద గిగ్ వర్కర్లకు ప్రత్యేక హెల్త్ కార్డులు, గుర్తింపు కార్డులు అందించనున్నట్లు వెల్లడించారు. వీటిని ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకుని పొందవచ్చు.
మెడికల్ విద్యలో విస్తరణ
వచ్చే ఐదేళ్లలో 75,000 కొత్త మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా వైద్యవిద్యా అవకాశాలు పెరగడంతోపాటు రోగులకు మెరుగైన వైద్యం అందనుంది. 36 ఔషధాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది, దీని వల్ల జనరిక్ మెడిసిన్స్, అవసరమైన ఔషధాల ధరలు తగ్గే అవకాశం ఉంది.






