ఏపీ రూపురేఖలు మార్చనున్న బుల్లెట్ రైళ్లు..

ఆంధ్రప్రదేశ్‌ మీదుగా త్వరలో బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. హైదరాబాద్‌ నుంచి చెన్నై, హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్లే రెండు ప్రధాన హైస్పీడ్ రైలు మార్గాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులతో తెలుగు రాష్ట్రాల ముఖచిత్రం పూర్తిగా మారనుంది.

హైదరాబాద్‌ నుంచి చెన్నైకి వెళ్లే బుల్లెట్ రైలు మార్గం అమరావతి మీదుగా వెళ్తుంది. మొత్తం 744.5 కి.మీ. పొడవైన ఈ మార్గానికి ప్రాథమికంగా గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. ఈ ప్రాజెక్టులో తెలంగాణలో ఆరు, ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది, తమిళనాడులో ఒక స్టేషన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్గం శంషాబాద్, నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా వచ్చి అమరావతి గుండా గుంటూరు, చీరాల వైపు వెళ్తుంది. అక్కడి నుంచి చెన్నైని చేరుకుంటుంది. ఈ మొత్తం పొడవులో ఆంధ్రప్రదేశ్‌లో 448.11 కి.మీ. మేర మార్గం ఉంటుంది.

25% చదివారు

తిరుపతికి కూడా కనెక్ట్ చేస్తారా?

హైదరాబాద్‌-చెన్నై మార్గాన్ని తిరుపతి మీదుగా మలచాలని ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అలా చేస్తే తిరుపతికి వచ్చే భక్తులకు, యాత్రికులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఈ మార్పు వల్ల కారిడార్ పొడవు సుమారు 53.5 కి.మీ. పెరుగుతుంది. మొత్తం ఈ ప్రాజెక్టులో రెండు ట్రాక్‌లు, అదనపు లైన్‌లతో కలిపి దాదాపు 1,419.4 కి.మీ. ట్రాక్ నిర్మించనున్నారు.

50% చదివారు

హైదరాబాద్-బెంగళూరు మార్గం

హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్లే బుల్లెట్ రైలు మార్గానికి కూడా ఆమోదం లభించింది. ఈ మార్గం 576.6 కి.మీ. పొడవు ఉంటుంది. ఇది ఎక్కువగా ప్రస్తుత హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారికి సమాంతరంగా ఉంటుంది. ఈ మార్గంలో తెలంగాణలో నాలుగు, ఏపీలో ఆరు, కర్ణాటకలో మూడు స్టేషన్లు ఉంటాయి. ముఖ్యంగా శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ దగ్గర కియా పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ఒక స్టేషన్ ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్‌లో 263.3 కి.మీ. మేర మార్గం ఉంటుంది.

75% చదివారు

తెలుగు రాష్ట్రాల మధ్య వేగవంతమైన ప్రయాణం

ఈ రెండు బుల్లెట్ రైలు మార్గాలు పూర్తయిన తర్వాత, బెంగళూరు-చెన్నై ప్రాజెక్టు కూడా పూర్తయితే, ఈ నాలుగు మెట్రో నగరాలు (హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు) బుల్లెట్ రైలు మార్గాల చతుర్భుజిగా మారతాయి. దీంతో ఈ నగరాల మధ్య ప్రయాణం కేవలం గంట లేదా రెండు గంటల్లోనే పూర్తయ్యే అవకాశం ఉంది.

100% చదివారు

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *