- గుంటూరు మిర్చి యార్డులో పర్యటనపై కేసు నమోదు
- ఎన్నికల కోడ్ ఉల్లంఘన, ట్రాఫిక్ అంతరాయం ఆరోపణలు
మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు మిర్చియార్డులో అనుమతి లేకుండా పర్యటించారంటూ గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎన్నికల కమిషన్ ఫిర్యాదు మేరకు, ఎన్నికల నియమాలను ఉల్లంఘించారనే ఆరోపణలతో ఈ కేసును నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, ముందస్తు అనుమతి లేకుండా మిర్చియార్డులోకి జగన్ ప్రవేశించారని, దీనివల్ల రైతులకు, వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కలిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. జగన్తో పాటు మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, ఇతర నేతలపైనా కేసు నమోదు చేశారు.





