- 43వ ఆవిర్భావ వేడుకల్లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- “తెదేపా కార్యకర్తలే అసలైన బలం” – చంద్రబాబు
తెలుగు దేశం పార్టీ (తెదేపా) 43వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. “తెదేపా ఒక మహనీయుడి విజన్. ఇది ఆదర్శాల కోసం ఏర్పడిన పార్టీ” అని ఆయన స్పష్టం చేశారు. పార్టీకి ప్రతి కార్యకర్త వారసుడే కానీ, ఎవరు పెత్తందారులు కావొద్దని ఆయన వ్యాఖ్యానించారు.
“తెదేపా నిలిచి ఉండే పార్టీ”
చంద్రబాబు మాట్లాడుతూ, ఎన్టీఆర్ 9 నెలల్లోనే తెదేపాను అధికారంలోకి తెచ్చారని, అప్పటి నుంచి ఇది ప్రజా సంక్షేమ పార్టీగా ఎదిగిందన్నారు. “తెదేపాను కూల్చాలని కొందరు ప్రయత్నించారు, కానీ వారు కాలగర్భంలో కలిసిపోయారు. పార్టీకి ఉన్న సంకల్పబలం తెలుగువారి భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది” అని చంద్రబాబు తెలిపారు. 43 ఏళ్ల కాలంలో ఎదురైన ప్రతి సవాలును విజయంగా మార్చుకున్నామన్నారు. “తెదేపాను గుండెల్లో పెట్టుకుని బతికే పసుపు సైన్యానికి నా పాదాభివందనం” అని చంద్రబాబు అన్నారు.





