నిర్మాణ రంగ పునరుద్ధరణలో రాష్ట్రం ముందంజలో: సీఎం చంద్రబాబు

గత పాలకుల వైఫల్యాలతో రాష్ట్రం సమస్యల బారిన పడిందని, నిర్మాణ రంగం అధ్వానంగా మారిందని ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. గుంటూరులో చేబ్రోలు హనుమయ్య మైదానంలో నరెడ్కో ప్రాపర్టీ షోను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కొత్త ఏడాదిలో నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. గత వైకాపా పాలనలో ఈ రంగం తీవ్రంగా నష్టపోయింది. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఇసుక విధానంతో ఈ రంగానికి గట్టి బలాన్ని అందించాం. ప్రస్తుతం ఈ రంగంపై 34 లక్షల మంది జీవనం ఆధారపడి ఉన్నారు. భూ సమస్యలు, రియల్‌ ఎస్టేట్‌ సమస్యల పరిష్కారానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది,’’ అని చంద్రబాబు అన్నారు.

భూ కబ్జాదారులపై చర్యలు

గత పాలనలో భూ కబ్జాదారుల తీరుతో భూములపై అనేక సమస్యలు తలెత్తాయని, వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. టీడీఆర్‌ బాండ్ల సమస్యను కూడా చర్చించి పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ‘‘స్వర్ణాంధ్ర విజన్‌ డాక్యుమెంట్‌ను సాధించడమే మా లక్ష్యం. మేం అధికారంలోకి వచ్చాక రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంతకాలు చేయించాం. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పని చేస్తాం,’’ అని చంద్రబాబు అన్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *