చైనా మరో అద్భుతం.. గంట ప్రయాణం ఒక్క నిమిషంలో!

చైనా మళ్లీ ఓసారి తన ఇంజనీరింగ్‌ ప్రతిభను చాటింది. గుయ్‌ఝౌలోని బీపన్‌ నదిపై రెండు మైళ్ల పొడవున్న హువాజియాంగ్‌ గ్రాండ్‌ కెన్యాన్‌ బ్రిడ్జ్‌ను నిర్మించి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా రికార్డు సృష్టించింది. ఈఫిల్‌ టవర్‌ కంటే ఎత్తైన ఈ బ్రిడ్జ్‌, గంట పట్టే ప్రయాణాన్ని ఒక్క నిమిషంలో చేసేస్తుందట!

  • ఎత్తు, బరువు లెక్కలు: 2050 అడుగుల ఎత్తు, ఈఫిల్‌ టవర్‌ కంటే 200 మీటర్లు ఎక్కువ, మూడు రెట్ల బరువుతో నిర్మాణం.
  • వేగవంతమైన పని: 2022లో షురూ చేసి, మూడేళ్లలో రూ.2400 కోట్లతో పూర్తి.

ఈ వంతెన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. జూన్‌లో ఓపెన్‌ కానున్న ఈ బ్రిడ్జ్‌, గతంలో గంట పట్టే లోయ దాటే ప్రయాణాన్ని ఒక్క నిమిషంలో ముగించేస్తుంది. గ్రామీణ రవాణా సులభతరం కానుంది, పర్యాటక ఆకర్షణగా కూడా మారనుంది. చైనాలో ఇలాంటి భారీ కట్టడాలు చాలానే ఉన్నాయి. ప్రపంచంలోని 100 ఎత్తైన వంతెనల్లో సగం ఇక్కడే ఉన్నాయంటే, వాళ్ల ఇంజనీరింగ్‌ స్కిల్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *