- సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన మూడు ప్రధాన సూత్రాలు
- పేదలకు గౌరవంగా సంక్షేమ పథకాలు అందించాలని సూచన
జిల్లాల అభివృద్ధి బాధ్యత పూర్తిగా కలెక్టర్లదేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అధికార దర్పం విడనాడి, ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేయాలని సూచించారు. మంగళవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర పరిపాలనపై ముఖ్యమంత్రి ముద్రలా, జిల్లాల్లో కలెక్టర్లు చేసే పనులు శాశ్వతంగా గుర్తుండిపోతాయని అన్నారు. ప్రజల ఆకాంక్షలు తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
కలెక్టర్లకు సీఎం కీలక సూచనలు
సంక్షేమ పథకాలను పేదలకు గౌరవంగా అందించాలి… ఏప్రిల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్.. జూన్ కల్లా ఉపాధ్యాయ నియామకం… 204 అన్న క్యాంటీన్లు ప్రారంభం.. తరచూ పర్యవేక్షించాలి… వడగాలులతో ప్రాణనష్టం జరగకుండా నీటి సరఫరా పకడ్బందీగా నిర్వహించాలి… జీఎస్టీ ఎగవేతపై కఠిన చర్యలు తీసుకోవాలి.. ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేసి, అవాంతరాలు తొలగించాలి.
మే నెలలో తల్లికి వందనం కింద పిల్లల తల్లులకు రూ.15 వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.14 వేలు, మత్స్యకారులకు రూ.20 వేల వేటనిషేధ భత్యం అందిస్తామని చంద్రబాబు తెలిపారు.





