‘‘భవిష్యత్తు సీఎం లోకేశ్’’ అంటూ జ్యూరిక్‌లో ఐరోపా తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం భరత్‌ను చంద్రబాబు మందలిస్తూ, మంత్రులు బాధ్యతతో వ్యవహరించాలని హితవు పలికారు.
పెట్టుబడులపై దృష్టి పెట్టాలని సూచన
‘‘మనం ఇక్కడ పెట్టుబడులు ఆకర్షించడానికి వచ్చాం. ఇలాంటి వ్యాఖ్యలు అవసరమా? భవిష్యత్తు సీఎంపై మాట్లాడాల్సిన సందర్భం ఇది కాదు,’’ అంటూ చంద్రబాబు టీజీ భరత్‌ను గట్టిగా హెచ్చరించారు. మంత్రి భరత్ మాట్లాడుతూ, ‘‘లోకేశ్ పార్టీ భవిష్యత్తు నాయకుడు, కాబోయే సీఎం’’ అని వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది. చంద్రబాబు ఈ తరహా వ్యాఖ్యలను మున్ముందు మళ్లీ చేయవద్దని తేల్చిచెప్పారు.





