మనవడు బర్త్ డే సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల దర్శనం!!

  • తితిదే ఛైర్మన్, అర్చకుల లాంఛన స్వాగతం
  • రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాంశ్‌ జన్మదినం సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, అర్చకులు లాంఛనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. సీఎం కుటుంబానికి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. తిరుమల దర్శనం అనంతరం తరిగొండ వెంగమాంబ సత్రంలో దేవాంశ్‌ పేరుతో అన్నదానం నిర్వహించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రసాదాలు వడ్డించి భక్తులకు సేవ చేశారు. తిరుమల పర్యటన ముగించుకుని మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *