“కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న సస్పెన్షన్‌!”

  • పార్టీ వ్యతిరేక చర్యల కారణంగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం
  • షోకాజ్‌ నోటీసుకు స్పందించకపోవడంతో సస్పెన్షన్‌ ఉత్తర్వులు

కాంగ్రెస్‌ పార్టీ తీన్మార్‌ మల్లన్నను సస్పెండ్‌ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపణల నేపథ్యంలో, ఫిబ్రవరి 5న షోకాజ్‌ నోటీసులు జారీ చేసి, 12లోపు వివరణ ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. కానీ మల్లన్న నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో, కమిటీ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ జి. చిన్నారెడ్డి సంతకంతో సస్పెన్షన్‌ ఉత్తర్వులు విడుదలయ్యాయి. తీన్మార్‌ మల్లన్న భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *