డ్రై ఫ్రూట్స్ నాన బెట్టేందుకు నీళ్లా? పాలా? ఏది ఆరోగ్యానికి మేలు?

వాల్నట్స్, బాదం, ఖర్జూరాలు లాంటి డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే. అయితే వీటిని రాత్రంతా నానబెట్టడం వల్ల మరింత పుష్టికరంగా మారతాయి. సాధారణంగా చాలా మంది నీటిలో నానబెట్టి తీసుకుంటారు. కానీ పాలు‌లో నానబెట్టడం మరింత ప్రయోజనకరమా? వివరాల్లోకి వెళదాం.

నీటిలో నానబెట్టడం వల్ల కలిగే లాభాలు
“నీటిలో డ్రై ఫ్రూట్స్ నానబెట్టడం వలన అవి మృదువవుతాయి, జీర్ణ ప్రక్రియ సులభతరం అవుతుంది. ఫైటిక్ యాసిడ్ తగ్గి పోషకాలు శరీరానికి బాగా అందుతాయి” అని డైటీషియన్ మరియు డయాబెటిస్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, శరీరానికి మంచివైన ఎంజైములను క్రియాశీలం చేసి, పోషక విలువను పెంచుతుంది. కొన్నిరకాల డ్రై ఫ్రూట్స్ లో ఉన్న షుగర్ స్థాయిలు కూడా తగ్గుతాయి.

పాలలో నానబెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు
పాలలో డ్రై ఫ్రూట్స్ నానబెట్టడం వలన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ మరియు పాలలోని ప్రోటీన్, కాల్షియంతో కలిసిపోతాయి. “ఇది పోషకాలతో నిండిన పానీయంగా మారుతుంది. పాలు నానబెట్టడం వల్ల పొడి ఫలాలు మరింత మెత్తబడతాయి, పోషకాలు బాగా శరీరానికి అందుతాయి. ఫైబర్ జీర్ణం కూడా సులభమవుతుంది” అని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు. అంతేకాకుండా, ఇది గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచి శరీరానికి మేలు చేసే మైక్రోబ్స్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

నీరు లేదా పాలు – ఏది ఉత్తమం?
ఇది వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది. నీటిలో నానబెట్టడం జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు ఫైటిక్ యాసిడ్‌ను తగ్గించి షుగర్ స్థాయిని కొద్దిగా తగ్గిస్తుంది. పాలలో నానబెట్టడం వల్ల ప్రోటీన్, కాల్షియం లభించడంతో పాటు రుచిగా ఉంటుంది. అందుకే, ఎవరికి ఎలాంటి పోషకాలు అవసరమో దాన్ని బట్టి నీరు లేదా పాలను ఎంచుకోవచ్చు. తక్కువ కాలరీలతో కూడిన సులభమైన ఎంపిక కోసం నీరు సరైనదైతే, ప్రోటీన్ మరియు కాల్షియం అవసరమయితే పాలు మంచి ప్రత్యామ్నాయం.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *