గూగుల్ కాంటాక్ట్ లు: ముఖ్యమైన రోజుల్ని మర్చిపోతున్నారా? 

ఊహ తెలిసింది మొదలు.. మెదడులో అన్నీ స్టోర్ అవుతుంటాయి. ఫలాన రోజు అలా జరిగింది.. ఆ రోజు మేం అక్కడికి వెళ్లాం.. అది చేశాం.. ఇది తిన్నాం.. అని చెబుతుంటాం.  అయితే, అన్ని మెమొరీస్ కి కచ్చితంగా ఓ ట్యాగ్ ఉంటుంది. అదే తేది. సందర్భాలు, సంఘటనలు.. ఇలా ఏదైనా తేదీలతోనే గుర్తు పెట్టుకుంటాం. తిరిగి సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ప్రాసెస్ లోనే కొన్ని ఈవెంట్స్ ని మర్చిపోతుంటాం. అవి పుట్టినరోజులు అయ్యిండొచ్చు… పెళ్లి రోజులు కావచ్చు.. అలా జరగకుండా ఉండాలంటే? ఈవెంట్ ఏదైనా మిస్ కాకుండా అటెండ్ అవ్వాలంటే? సింపుల్ గా గూగుల్ క్యాలెండర్ సాయం తీసుకోవచ్చు.  సంప్రదాయ పద్ధతిలోనే కాకుండా.. చాలా సింపుల్ టెక్నిక్ తో ముఖ్యమైన తేదీల్ని ఆయా కాంటాక్ట్ లకు జత చేయొచ్చు. ఉదాహరణకి.. మీ ఫోన్ లోని ఓ వ్యక్తి పుట్టిన రోజుని గుర్తుంచుకోవాలి అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారంటే.. ఫోన్ లోని గూగుల్ కాంటాక్ట్స్ లోకి వెళ్లాలి.  అతని ఫోన్ నెంబర్ ని ట్యాప్ చేయాలి. తిరిగి తెర పైభాగంలో కనిపించే ‘పెన్సిల్ ఐకాన్’ని తాకాలి. దీంతో ఎడిట్ కాంటాక్ట్ ఓపెన్ అవుతుంది.  అక్కడ కనిపించే ఆప్షన్స్ లోని ‘యాడ్ సిగ్నిఫికెంట్ డేట్’ ని ట్యాప్ చేయండి. దీంతో వారికి సంబధించిన ముఖ్యమైన తేదిలను మార్క్ చేయవచ్చు. ‘నోట్స్’లో ఆ తేది గురించి రాయొచ్చు. ఉదాహరణకు పుట్టిన రోజు అయితే.. ఎలా ప్లాన్ చేయాలో డిస్ క్రిప్షన్ రాసుకుని ‘సేవ్’ చేయాలి. అంతేకాదు..  ఆయా ముఖ్యమైన తేదిలను నోటిఫికేషన్స్ రూపంలో మీకు ఒకటిరెండ్రోజులకు ముందే వచ్చేలా చేయొచ్చు.  అందుకు యాడ్ చేసి సిగ్నిఫికెంట్ డేట్ పక్కనే కనిపించే ‘బెల్’ ఐకాన్ ని సెలెక్ట్ చేయాలి.  ఏ రోజు.. ఏ టైమ్ కి మీకు నోటిఫికేషన్ రావాలో మీరే సెట్ చేసుకునే వీలుంది.  ఈ ప్రాసెస్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో ఒకేలా ఉంటుంది. ఒక వేళ మీరు దీన్ని డెస్క్టాప్ పైన చేద్దాం అనుకుంటే.. గూగుల్ కాంటాక్ట్స్ వెబ్ సైట్ ని ఓపెన్ తేదీలను యాడ్ చేసుకోవచ్చు.  ఒకవేళ ఎప్పుడైనా ఈవెంట్స్ ని తొలగించాలనుకుంటే… ‘గూగుల్ కాంటాక్ట్స్’ వెళ్తే ‘రిమూవ్’ ఆప్షన్ కనిపిస్తుంది.  ట్యాప్ చేస్తే చాలు.  కావాలంటే.. డిలీట్ చేయకుండా ‘హైడ్’ కూడా చేయొచ్చు. 

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *