
Infosys సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఇటీవల 70 గంటలు వారానికి పని చేయాలని వ్యాఖ్యానించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి… ఇప్పుడు అలాంటి మరో స్టేట్ మెంట్ ను నారాయణమూర్తి ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో నారాయణమూర్తి మాట్లాడుతూ, “మేము Infosys ను ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలతో పోల్చుతాం. అప్పుడు భారతీయులు చాలా చేయాల్సి ఉంది. మన దేశంలో ఇంకా 80 కోట్ల మంది ఉచిత రేషన్ తీసుకుంటున్నారు. అంటే ఆ 80 కోట్ల మంది పేదరికంలో ఉన్నట్టే. అందుకే మనం aspirations ను ఉన్నతంగా ఉంచుకోవాలి. వారానికి 70 గంటలు పని చేయలేకపోతే ఈ పేదరికాన్ని ఎలా అధిగమించగలము? మనం కష్టపడి పనిచేస్తేనే పేదరికం నుంచి బయటపడవచ్చు” అని అన్నారు.





