18 ఏళ్లకే సుమారు రూ.17 కోట్ల ప్రైజ్ మని!! ఈ అద్భుత విజయం వర్త్ మామ వర్త్!!

18 ఏళ్ల వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచి, చరిత్ర సృష్టించిన దొమ్మరాజు గుకేశ్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. సింగపూర్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించి, ఈ అద్భుత విజయం సాధించాడు.

ఈ విజయంతో గుకేశ్‌కు భారీ ప్రతిఫలం లభించింది. 13 లక్షల 50 వేల డాలర్లు (సుమారుగా 11.45 కోట్ల రూపాయలు) ప్రైజ్ మనీతో పాటు, మూడు గేమ్‌లు గెలిచినందుకు అదనంగా 5.07 కోట్ల రూపాయలు కూడా అందుకున్నాడు. మొత్తంగా అతడికి 16.52 కోట్ల రూపాయల బహుమతి లభించింది. రన్నరప్‌గా నిలిచిన డింగ్ లిరెన్‌కు 9.75 కోట్ల రూపాయల నగదు బహుమతి లభించింది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *