‘సార్ కంటే ముందే కుబేర స్టార్ట్ అయ్యింది’’: ధనుష్

  • ‘‘ఈ సినిమా 51వది కావడం కంటే… ఇలాంటి కథ దొరకడం నా అదృష్టం’’
  • ‘‘నాగ్‌ సర్‌తో పనిచేయడం నా కెరీర్‌లో స్పెషల్ మొమెంట్‌’’ అని చెప్పిన ధనుష్‌

తెలుగులో ‘సార్’ తర్వాత మళ్లీ స్క్రీన్‌పైకి వస్తున్న ధనుష్, తన కొత్త సినిమా ‘కుబేర’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ సినిమాలో నేను నటించిన కొన్ని సీన్లు చూస్తే నాన్న గుర్తొచ్చారు. ఆయన లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. ‘కుబేర’ తమిళ్‌లో నా 51వ సినిమా, తెలుగులో రెండో చిత్రం. కానీ ‘సార్’ మూవీకి ముందే శేఖర్ సర్ ఈ కథ చెప్పారు. ఇందులో ఛాన్స్ ఇచ్చినందుకు ఆయనకు థాంక్స్‌’’ అని ధనుష్ అన్నారు.

‘‘శేఖర్ సర్ చాలా కష్టపడ్డారు!’’

‘‘ఈ సినిమాపై శేఖర్ సర్‌కి ఎంత నమ్మకమో చూస్తుంటే నాకు భయంగా ఉంది. ఆయన ఈ ప్రాజెక్ట్‌కి ఎంత కష్టపడ్డారో నేను దగ్గరుండి చూశా. నాగార్జున సర్‌తో కలిసి నటించడం ఎంతో స్పెషల్ అనిపించింది. ఇక రష్మిక గురించి చెప్పాలంటే… ఆమె నిజంగా కష్టపడే ఆర్టిస్ట్. ఆమెతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది’’ అని ధనుష్ తెలిపారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *