బాలీవుడ్ బ్యూటీ రహస్య వివాహం!? ఆమె హరిహర వీరమల్లు హీరోయిన్ కూడా!

  • అమెరికాలో గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి?
  • స్విట్జర్లాండ్ ట్రిప్ ఫొటోస్‌తో పెళ్లి వార్త వైరల్

బాలీవుడ్ యంగ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ తన ప్రియుడు, వ్యాపారవేత్త టోనీ బేగ్‌ను సీక్రెట్‌గా వివాహం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లాస్ ఏంజెలెస్‌లోని ఓ స్టార్ హోటల్‌లో గత వీకెండ్‌ తక్కువ మంది కుటుంబసభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగినట్లు బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ జంట అధికారికంగా పెళ్లి గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. వివాహం అనంతరం నర్గీస్-టోనీ జంట నేరుగా స్విట్జర్లాండ్ వెళ్ళింది. అక్కడి ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలు నర్గీస్ తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీరి పెళ్లి ప్రచారం మరింత బలపడింది. కాగా, టోనీ బేగ్ కశ్మీర్‌కు చెందిన బిజినెస్‌మెన్. 2022 నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు నర్గీస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే.

నర్గీస్ ఫక్రీ కెరీర్ అప్‌డేట్

నర్గీస్ 2011లో ‘రాక్‌స్టార్’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ‘కేఫ్’, ‘డిష్యుం’, ‘హౌస్‌ఫుల్-3’ వంటి సినిమాల్లో నటించింది. తెలుగు ప్రేక్షకులకు ‘అమావాస్య’ సినిమా ద్వారా పరిచయమైన నర్గీస్, ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’లో కీలక పాత్ర పోషిస్తోంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *