- ‘రూ.5కే ఇంత మంచి భోజనం అంటే నమ్మలేకపోతున్నాం’
- విశాఖలో అన్న క్యాంటీన్లో భోజనం చేసిన ‘తల’ టీమ్
‘తల’ సినిమా ప్రమోషన్ కోసం విశాఖకు వచ్చిన నృత్య, చిత్ర దర్శకుడు అమ్మ రాజశేఖర్ రూ.5కే లభించే అన్న క్యాంటీన్ భోజనాన్ని ప్రశంసించారు. హీరో రాగిణిరాజ్, నటుడు ముక్కు అవినాష్‌తో కలిసి మంచి హోటల్ కోసం వెతుకుతుండగా, రామాటాకీస్ కూడలి వద్ద జనంతో ఉన్న అన్న క్యాంటీన్‌ను చూసి అక్కడే భోజనం చేశారు. క్యూలో నిలబడి అందరిలాగే భోజనం చేసిన వారు, ఇంత తక్కువ ధరకు ఈ స్థాయి భోజనం లభిస్తుండటం నిజంగా ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. అన్న క్యాంటీన్ భోజనం రుచిని ఆస్వాదించిన తర్వాత అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ, ‘ఇక్కడి ప్రజలకు మంచి ప్రభుత్వం ఉంది. ఇంత తక్కువ ధరకు ఇంత మంచి భోజనం అందిస్తుండటం గర్వకారణం’ అని అన్నారు. తక్కువ ఖర్చుతో సాంత్వనగా భోజనం చేసే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.





