- బందీలను విడుదల చేయకుంటే గాజాను మరింత నాశనం చేస్తానని ట్రంప్ హెచ్చరిక
- హమాస్ చర్యలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌కు పూర్తి మద్దతు ప్రకటించిన అమెరికా
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌పై మరోసారి తీవ్రంగా స్పందించారు. ఆ సంస్థ చెరలో ఉన్న బందీలను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే గాజా మరింత నాశనమవుతుందని హెచ్చరించారు. ట్రంప్ ఈ విషయాన్ని తన ట్రూత్ సోషల్ అకౌంట్‌లో పోస్టు చేశారు. బందీలను విడిచిపెట్టకుండా ఆలస్యం చేస్తే హమాస్‌కు చెందిన ఒక్కరూ సురక్షితంగా ఉండరు అని స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య మూడో విడత యుద్ధం కొనసాగుతున్న సమయంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచింది. తాజాగా హమాస్‌ను గట్టిగా హెచ్చరించడం, గాజాను స్వాధీనం చేసుకోవాలని పరోక్షంగా సూచించడం చర్చనీయాంశంగా మారింది. అయితే, పాలస్తీనియన్లను వేరే ప్రాంతానికి తరలించాలనే ట్రంప్ ప్రతిపాదనను సౌదీ, జోర్దాన్ సహా అనేక దేశాలు ఖండించాయి.





