బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య: అబద్ధం చెప్పాననే మనస్తాపంతో ఉరి

మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌ మండలానికి చెందిన సుభాష్‌(22), హైదరాబాద్‌ కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో బీటెక్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. అయితే, కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయినా తల్లిదండ్రులకు పాస్‌ అయ్యానంటూ అబద్ధం చెప్పాడు. ఈ విషయం నిజం తెలిస్తే తల్లిదండ్రులు ఏమంటారోనని లోలోపలే తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు.ఈ క్రమంలో సోమవారం సుభాష్‌ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుమారుడు ఆత్మహత్య చేసుకున్న వార్తతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *