బైక్‌పై 3,000 కిలోమీటర్ల ప్రయాణం: తండ్రితో కొడుకు కుంభమేళా యాత్ర!!

  • కర్ణాటక యువకుడు ప్రజ్వల్‌ షెనాయ్‌ తండ్రిని బైక్‌పై ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభమేళాకు తీసుకెళ్లాడు
  • రాత్రివేళ టెంట్లలో బస చేసి, రోజు కనీసం 600 కి.మీ ప్రయాణిస్తూ 7 రోజుల్లో గమ్యస్థానానికి చేరుకున్నారు

కర్ణాటకలోని శిర్వా గ్రామానికి చెందిన ప్రజ్వల్‌ షెనాయ్‌ (25) తన తండ్రి రాజేంద్ర షెనాయ్‌ (52) తో కలిసి బైక్‌పై ఫిబ్రవరి 6న ఉదయం 4 గంటలకు ప్రయాణం మొదలుపెట్టాడు. కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల మీదుగా 3,000 కి.మీ ప్రయాణించి ఫిబ్రవరి 10న ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్నారు. తండ్రీకొడుకులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసి, ఫిబ్రవరి 13న తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు.

సంకల్ప బలం – భక్తి మార్గం

ఈ ప్రయాణంలో రాత్రివేళ పెట్రోల్‌ బంకుల వద్ద టెంట్లు వేసుకుని బస చేస్తూ, ఉదయం మళ్లీ ప్రయాణాన్ని కొనసాగించేవారు. భారీగా ట్రాఫిక్‌ ఉన్నప్పటికీ బైక్‌లకు అనుమతి ఉండటంతో ఏ అడ్డంకులూ లేకుండా ముందుకు సాగామన్నారు. ప్రయాణ మార్గంలో ఓ వ్యక్తి తన కుమారుడికి కొత్త హెల్మెట్‌ బహుమతిగా ఇచ్చాడు. ఈ ప్రయాణానికి మొత్తం రూ.20 వేలు మాత్రమే ఖర్చయ్యిందని రాజేంద్ర షెనాయ్‌ వెల్లడించారు. ఇదే తండ్రీకొడుకులు గతేడాది జూన్‌లో 2,100 కి.మీ ప్రయాణం చేస్తూ హిమాచల్‌ ప్రదేశ్, లద్ధాఖ్‌, కార్గిల్‌ను సందర్శించారు. ప్రపంచంలోనే రెండో ఎత్తైన ఖార్దుంగ్లాపాస్‌ (17,982 అడుగులు) వద్ద కన్నడ జెండా ఎగురవేశారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *