బ్రెజిల్‌లో క్రిస్మస్ వేళ విషాద ఘటన: విమానం కూలి 10 మంది మృతి

బ్రెజిల్‌లో క్రిస్మస్ వేళ ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యాపారవేత్త తానే నడుపుతూ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వెళుతున్న విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానం ఇళ్లను ఢీకొట్టి కూలిపోవడంతో అందులో ఉన్న 10 మంది మృతి చెందారు. ఈ ఘటనలో గాయాలైన 15 మందిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటన గ్రామడో అనే టూరిస్టు పట్టణంలో జరిగింది, ఇది పాపులర్ టూరిస్టు డెస్టినేషన్‌గా ప్రసిద్ధి చెందింది. బ్రెజిలియన్ సివిల్ డిఫెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, విమానం తొలుత ఓ బిల్డింగ్‌ను ఢీకొట్టి, తరువాత మొబైల్ ఫోన్‌లు అమ్మే షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం జరిగేటప్పుడు గ్రామడో పర్వత ప్రాంతంలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండడం గమనార్హం.
ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *