రాష్ట్ర ప్రజలకు త్వరలో ఉచిత ఆరోగ్య బీమా.. షరతులు లేకుండా సేవలు!!

  • ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం
  • చికిత్స కోసం 6 గంటల్లోనే అనుమతి, షరతులు లేకుండా సేవలు

రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా ఏడాదికి రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించబడుతోంది. కొత్త బీమా విధానంలో షరతులు లేకుండా ఆరోగ్య సేవలు అందించేందుకు టెండరు ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వం ప్రతిపాదనలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి త్వరలో అధికారికంగా అమలు చేయనుంది. ప్రస్తుతం ట్రస్టు ద్వారా చికిత్సకు అనుమతి పొందేందుకు 24 గంటలు పడుతుంది. అయితే, కొత్త బీమా విధానంలో 6 గంటల్లోనే అనుమతి లభించనుంది. అలాగే, బీమా సంస్థ అనుమతి నిరాకరిస్తే, వెంటనే అప్పీల్ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు ముందుగా చెల్లింపులు చేసే విధానం అమలు చేయడం వల్ల బిల్లుల సమస్యలు తలెత్తకూడదు.

రూ. 2500 ప్రీమియంతో పూర్తి ఆరోగ్య భద్రత

ప్రతి కుటుంబానికి రూ. 2500 ప్రీమియం చెల్లించి, ఆరోగ్య భీమా సదుపాయం కల్పించనున్నారు. ఇప్పటికే తమిళనాడు, మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో ప్రభుత్వ బీమా విధానం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ మోడల్‌ను అధ్యయనం చేసి, రాష్ట్రానికి తగ్గట్లు ఉత్తమ ప్రణాళిక సిద్ధం చేశారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *