రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా, రామ్‌చరణ్‌ను అభినందిస్తూ, “నేను చాలా తక్కువ సందర్భాల్లో అసూయపడుతుంటా. ‘మగధీర’లో చరణ్ గుర్రపు స్వారీ చూసినప్పుడు అసూయపడ్డా. నేనూ నేర్చుకుని ఉంటే బాగుండేదనిపించింది,” అని అన్నారు. రామ్‌చరణ్ గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. “చిత్ర పరిశ్రమలోని అందరి హీరోలకు రామ్‌చరణ్ స్నేహితుడు. ఏడాదిలో 100 రోజులు అయ్యప్ప, ఆంజనేయస్వామి దీక్ష చేస్తుంటాడు. ‘ఇవన్నీ ఎందుకు’ అని అడిగితే, ‘బాధ్యతతో మెలగడానికి, అహంకారం లేకుండా ఉండటానికి’ అంటాడు,” అని పవన్ తెలిపారు.
అన్నగా ఆశీర్వాదం
“రామ్‌చరణ్ మా బంగారం. ఒక తల్లికి పుట్టకపోయినా నా తమ్ముడు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేవాడు. అద్భుత విజయాలు కలగాలని ఒక బాబాయి కాదు, అన్నగా ఆశీర్వదిస్తున్నా,” అని ఆయన చెప్పారు. అంతకు ముందు, దర్శకుడు శంకర్ మాట్లాడుతూ, “నేను 30 సంవత్సరాలలో 14 సినిమాలు చేశా. ఒక్కటీ నేరుగా తెలుగు సినిమా లేదు. అయినా.. మీరు నన్ను ఆదరించారు. మీ ప్రేమను మర్చిపోలేను,” అని అన్నారు. “మీ కోసం నేరుగా ఒక తెలుగు సినిమా తీయాలని ‘గేమ్ ఛేంజర్’ తీశా. ఇది అచ్చ తెలుగు మూవీ,” అని ఆయన తెలిపారు. “కలెక్టర్, మినిస్టర్‌కు మధ్య జరిగే యుద్ధమే ‘గేమ్‌ఛేంజర్’. హీరో వెనుక ఓ కథ ఉంటుంది. అదేంటనేది ఆసక్తికరం,” అని శంకర్ పేర్కొన్నారు.





