ఇటీవల బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తనపై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) స్పందించారు. గత 25 ఏళ్లుగా ఉద్యమం నుంచి తన రాజకీయ ప్రస్థానం ఒక తెరిచిన పుస్తకం అని ఆయన పేర్కొన్నారు.
“ఇటీవల నాపై, పార్టీపై కొందరు ఆరోపణలు చేశారు. ఎందుకు చేశారో, ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు చేశారో, వాటిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను” అని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో దిగజారుడు రాజకీయాలు మంచివి కావని ఆయన వ్యాఖ్యానించారు.
సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు విమర్శలు చేశారు. కేసీఆర్ గత పదేళ్లుగా నిర్మించిన ఒక్కో వ్యవస్థను రేవంత్‌రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ముందున్న ప్రధాన కర్తవ్యం అని ఆయన స్పష్టం చేశారు.





