ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025: త్వరలో టీమ్ ఇండియా జట్టు ప్రకటన!!

ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్‌ వేదికగా ప్రారంభమయ్యే ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025కు భారత జట్టు ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే పలు దేశాలు తమ జట్లను ప్రకటించగా, బీసీసీఐ మాత్రం జట్టు ప్రకటించలేదు. అయితే, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా ఈనెల 18 లేదా 19న టీమిండియా జట్టును ప్రకటించనున్నట్లు తెలిపారు.

హైబ్రిడ్‌ విధానం: దుబాయ్‌ వేదిక

భద్రతా ఆందోళనల నేపథ్యంలో పాకిస్తాన్‌లో ఆడేందుకు టీమిండియా నిరాకరించింది. దీనిపై చర్చల అనంతరం ఐసీసీ హైబ్రిడ్‌ విధానాన్ని అమలు చేయనుంది. ఈ విధానం ప్రకారం, భారత్‌ తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్‌ ఆడేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. గ్రూప్‌-‘ఎ’: భారత్‌, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా గ్రూప్‌-‘బి’: ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్‌, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *