భారతదేశంలో 2024 లో 84 సార్లు ఇంటర్నెట్ నిలిపివేశారు. ప్రజాస్వామ్య దేశాలలో ఇది చాలా ఎక్కువ. ఒక్క మయన్మార్ మినహా మరే దేశంలోనూ ఇంతలా ఇంటర్నెట్ షట్డౌన్ చేయలేదు. చాలా షట్డౌన్లు నిరసనలు, మత హింస వల్ల జరిగాయి. అంతే కాదు, ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల సమయంలో కూడా ఇంటర్నెట్ బంద్ చేశారు. దాదాపు 16 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇంటర్నెట్ షట్డౌన్ చేశారు. మణిపూర్లో అత్యధికంగా 21 సార్లు, హర్యానా, జమ్మూ కాశ్మీర్లో 12 సార్లు ఇంటర్నెట్ బంద్ చేశారు. ప్రభుత్వం కొత్త టెలికాం చట్టం తెచ్చింది. కానీ, ఇందులో షట్డౌన్లను ఆపేందుకు సరైన నిబంధనలు లేవు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, 54 దేశాల్లో 296 సార్లు ఇంటర్నెట్ షట్డౌన్ చేశారు. ఆసియా పసిఫిక్లోనే ఎక్కువ షట్డౌన్లు జరిగాయి. ఇంటర్నెట్ షట్డౌన్ వల్ల అనేక రంగాలకు అంతరాయం కలుగుతుంది. నష్టం కూడా ఎక్కువే!!






